Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshఆర్కే...కొత్త పలుకులొద్దు...!

ఆర్కే…కొత్త పలుకులొద్దు…!

ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
` మహిళలకు క్షమాపణలు చెప్పాలని నినాదాలు
విశాఖలో ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ భారీ ధర్నా

దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని , పార్టీని ముఖ్యంగా పార్టీ నాయకుల భార్యలను నీచ, నికృష్టమైన భాషతో దూషించిన వైనంపై వైసీపీ విశాఖ నాయకత్వం భారీ ఆందోళన నిర్వహించింది. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ జంక్షన్ హైవే వద్ద ఉన్న విశాఖ ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ వేమూరి రాధా కృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్ మెప్పు కోసం రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ మాట్లాడుతూ జర్నలిస్టుగా ఉండి సమాజానికి బాధ్యతగా వ్యవహరించాల్సిన వేమూరి రాధా కృష్ణ తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పు ప్రచారం చేస్తే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
కెకె రాజు మాట్లాడుతూ మీడియా వేదికలను ఉపయోగించి మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరమని, అందువల్ల రాధాకృష్ణ తన వ్యాఖ్యలపై ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కేకే రాజు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ , కరణం ధర్మశ్రీ , పేట్ల ఉమా శంకర్ గ·ణేష్, చింతలపూడి వెంకటరామయ్య , శోభా హైమవతి, తిప్పల నాగిరెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర,
సమన్వయకర్తలు, తిప్పల దేవన్ రెడ్డి , మొల్లి అప్పారావు ,మాజీ మేయర్ హరివెంకటకుమారి , నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ కోలా గురువులు, సిఎంఎ జహీర్ అహ్మద్, చింతకాయల సన్యాసి పాత్రుడు, వీసం రామ కృష్ణ, పేడాడ రమణి కుమారి, పిన్నమరాజు సతీష్ వర్మ, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కార్యాలయమ పర్యవేక్షకులు రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments