Wednesday, April 29, 2026
HomeNewsస్మార్ట్ కిచెన్ పేరుతో కార్మికుల పొట్ట కొట్టొద్దు

స్మార్ట్ కిచెన్ పేరుతో కార్మికుల పొట్ట కొట్టొద్దు

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని, స్మార్ట్ కిచెన్ పేరుతో కార్మికుల పొట్ట కొట్టొద్దని డిమాండ్ చేస్తూ చోడవరం మండలంలో గల మధ్యాహ్న భోజన కార్మికులు బుధవారం ఎంఈఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా, సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినప్పటికీ మా పిల్లలగా భావించి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం అందిస్తున్నామని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో 89 వేల మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీసే పద్ధతుల్లో ఈ స్మార్ట్ కిచెన్ తీసుకొస్తున్నారని ఆమె అన్నారు. స్కూల్లో వేడివేడిగా పిల్లలకి వంట చేసి పెడుతున్నామని, గతంలో 2018 సంవత్సరంలో ఇలాగే నవప్రయస సంస్థకి అప్పగించారని దాన్ని నిరసిస్తూ అప్పట్లో అప్పటి విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇల్లు ముట్టడి చేశామని, తరువాత పేరెంట్స్ నుండి, ప్రజల నుండి వంట బాగోలేదని నవ ప్రయాస సంస్థ వద్దని చెప్పి పిల్లలు పేరెంట్స్ పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేశారని, మళ్ళీ మధ్యాహ్న భోజన కార్మికులకే వంట అప్పగించడం జరిగిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉన్న వేలాది మంది కార్మికుల ఉసురు పోసుకుంటుందని, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆలోచించాలని, ఈ పథకంలో పనిచేస్తున్న మహిళలు ఒంటరి మహిళలు, పేద మహిళలు పనిచేస్తున్నారని, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచకపోయినా ఇదే ఉపాధిగా నమ్ముకొని బ్రతుకుతున్నారని, వాళ్ళ బ్రతుకుని రోడ్డుమీద పడయోద్దని ఆమె అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ స్మార్ట్ కిచెన్ ఆలోచన వెనుక తీసుకోవాలని, లేని పక్షంలో 2019లో ఏ పద్ధతుల్లో అయితే ఇంటికి వెళ్లారో, అదే పద్ధతుల్లో వచ్చే ఎన్నికల్లో మధ్యాహ్న భోజన కార్మికులందరూ బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ బుచ్చిరాజమ్మ, చిన్న తల్లి, లక్ష్మి, దేవి, వరలక్ష్మి, రమ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments