Sunday, April 19, 2026
HomeNewsపార్టీ కోసం ప్రాణం పెట్టే నాయకులు బిజెపిలో ఉన్నారు

పార్టీ కోసం ప్రాణం పెట్టే నాయకులు బిజెపిలో ఉన్నారు

ప్రపంచానికి దిక్సూచి మోడీ

బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం చోడవరం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవలే బిజెపిలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానుల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, సీనియర్ బిజెపి నాయకులు విశాఖ జిల్లా ఇన్చార్జి పుట్ట గంగయ్య, ఏ ఆర్ జి శర్మ తదితరులు పాల్గొని కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ 1980లో స్థాపించబడిన బిజెపి అటల్ జి మార్గదర్శనంలో నేడు ప్రధాని మోడీజీ అడుగుజాడల్లో పయనిస్తుందన్నారు. నేడు ప్రపంచానికే దిక్సూచిగా భారతదేశం ఎదిగిందని కొనియాడారు. బిజెపి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందని అధికారం కోసం అర్రులు చాచలేదన్నారు. దేశం కోసం పార్టీ కోసం ప్రాణాలర్పించడానికి కూడా బిజెపి కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారన్నారు జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు మాట్లాడుతూ.. బిజెపి క్రమశిక్షణ గల పార్టీ అని తరలించి కూడా సిద్ధాంతాల కోసం దేశం కోసం ధర్మం కోసం పోరాడుతుందని చెప్పారు. రెండు ఎంపీ సీట్లు నుంచి నేడు ప్రపంచాన్ని సాధించే స్థాయికి మోడీ నాయకత్వంలో భారతదేశం ఎదిగిందన్నారు. ప్రముఖ పరిశ్రమ కవిత బిజెపి నాయకుడు ఎమ్ వి ఆర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆశయాలు పనితీరు మిర్చి బీజేపీలో చేరినని ఆయన నాకు తండ్రి లాంటి వాడిని, ఆయన బిడ్డగా పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని ఈ ప్రాంతంలో ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments