Saturday, April 18, 2026
HomeNewsపేదల ఆకలి తీర్చడంలో జనచైతన్య సమితి సేవలు అభినందనీయం

పేదల ఆకలి తీర్చడంలో జనచైతన్య సమితి సేవలు అభినందనీయం

నిరుపేదల ఆకలి తీర్చడంలో జనచైతన్య సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని జమ్మూ కాశ్మీర్ కిస్తివాడ సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మందడపు ఏసోబు అన్నారు. పెదకూరపాడులో జరిగిన రెండు ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని సోమవారం జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు తెలపడంతో వారు ఆ ఆహారాన్ని సేకరించి మండలంలోని తాళ్లురు బుడిగి జంగాల కాలని, పెదకూరపాడులోని వలస కూలీలకు భోజనాన్ని పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఎస్సై ఏసోబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవాభావాన్ని కలిగి ఉండాలన్నారు.జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు మాట్లాడుతూ ఫంక్షన్ ఏదైనా భోజనాలు మిగిలి ఉంటే సమాచారం ఇవ్వండని ఆభోజనాలను సేకరించి ఎక్కడైతే పేదవారు ఉంటారు వారికి ఆహారాన్ని పంపిణీ చేస్తామన్నారు.
ఆకలితో ఉన్నవారి కడుపులోకి వెళ్ళే ఒక్కొక్క మెతుకు వారికి ప్రాణాన్ని పోసి వారిలో ప్రాణశక్తిని నింపేదనన్నారు.ఈకార్యక్రమంలో జన చైతన్య సమితి ప్రతినిధులు దాసరి విజయ్ బెన్నిబాబు,నాదెండ్ల అప్పారావు,గుడిపూడి బ్రహ్మనాయుడు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments