Sunday, April 19, 2026
HomeNewsగిరిజన బాలికల బాలల దినోత్సవం

గిరిజన బాలికల బాలల దినోత్సవం

  • గిరిజన బాలికల పాఠశాల-2 లో బాలల దినోత్సవం
  • జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు
  • విద్యార్థులు దేశ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి -హెచ్ఏం,బి. మంగమ్మ.
  • అనంతగిరి,జయ జయహే:

అనంతగిరి మండలం కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల-2లో బాలల దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు  బి.మంగమ్మ ఆధ్వర్యంలో పాఠశాలల్లో భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి,జ్యోతి ప్రజ్వలన చేసిఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు బి.మంగమ్మ మాట్లాడుతూ.. బాలల దినోత్సవ విశిష్టతను, నెహ్రు జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థి విద్యార్థినులు ఇలాంటి దేశ నాయకులును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు,అనంతరం పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలిపొందిన వాళ్ళకు బహుమతులు ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, వార్డెన్ రాజ్యలక్ష్మి,సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments