నిడదవోలు పట్టణంలోని లింగంపల్లి 23వ వార్డులో గ్రామ సందర్శనలో భాగంగా పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు మరియు ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృతంగా వివరించారు.
సీఐ తిలక్, ఎస్ఐ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ ప్రజలకు సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలి, రోడ్డు భద్రతా నియమాలను ఎలా పాటించాలి, ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన కెమెరాల ఉపయోగం గురించి తెలియజేశారు.
అదేవిధంగా, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వార్డు ఇంచార్జి బండి వేణుగోపాలకృష్ణ సీఐ తిలక్, ఎస్ఐ జగన్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి 23వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజల భద్రతే లక్ష్యం – నిడదవోలు లింగంపల్లిలో పోలీసుల అవగాహన డ్రైవ్
RELATED ARTICLES
