*విశాఖ తీరంలో టీఎస్సార్ సేవా పీఠం ఘనంగా 41వ మహా కుంభాభిషేకం*
బీచ్ లో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు అభిషేకాలు
– దేశంలోనే అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమం
– కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి
విశాఖపట్నం, ఫిబ్రవరి 15, జయ జయహే : కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద ఘనంగా 41వ మహా కుంభాభిషేకానికి కన్నులపండువగా జరిగింది. ఈ మహా కుంభాభిషేకం సందర్భంగా కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు అభిషేకం చేశారు. పవిత్ర జలాలు, పళ్ళ రసాలతో టి సుబ్బరామిరెడ్డి స్వయంగా భక్తులచే అభిషేకాలు చేయించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపు తాళ్లు, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేశారు. మహా కుంభాభిషేకం నేపథ్యంలో ఆర్కే బీచ్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. శివనామస్మరణతో సాగర తీరం ప్రతిధ్వనించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
*దేశంలోనే అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమం – టిఎస్సార్*
గత 40 ఏళ్లుగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం దేశంలోనే అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమమని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు . లోక కల్యాణం కోసం, అలాగే విశాఖకు ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఎటువంటి ఆపద కలగకూడదని 40ఏళ్ళ కిందట కాకినాడ భారత యజ్ఞ పీఠాధిపతి శివ భక్తులకే, ఈ మహా కుంభాభిషేక కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా మహా కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ మరియు తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, క్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం విశాఖపట్నం వాసుల అదృష్టమని పేర్కొన్నారు. డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి విశాఖ ప్రజల కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో సేవలు అందజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, టి.గురుమూర్తి రెడ్డి, బొడ్డేటి మహేష్, జనసేన నాయకులు బెహరా భాస్కర రావు, వైసీపీ నాయకులు చింతలపూడి వెంకట్రామయ్య, పేడాడ రమణి కుమారి, డాక్టర్ పూడి కిరణ్ కుమార్, ఆర్.చంద్రశేఖర్, ఆర్.వి.వి.సత్యనారాయణ టిఎస్ఆర్ కార్యదర్శి ఎస్.కే.భాష, దల్లి రామకృష్ణారెడ్డి, జగ్గుపిల్ల అప్పలరాజు, లంక శ్రీనివాస్, ఫిలిం డైరెక్టర్ వి.వంశి బాబు తదితరులు పాల్గొన్నారు.
