Home Politics Andhra Pradesh జేఈఈ మెయిన్స్ లో 210 మంది శ్రీ విశ్వ విజేతలే

జేఈఈ మెయిన్స్ లో 210 మంది శ్రీ విశ్వ విజేతలే

0

ఉత్తరాంధ్రలోనే అత్యధిక పర్సంటైల్ సాధన
– విజేతలను అభినందించిన ఛైర్మన్ ధనరాజు

విశాఖ కేంద్రం గా ఉన్న
శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో విజయ భేరి మోగించారు. ఉత్తరాంధ్రలోనే అత్యధిక పర్సంటైల్ తో తమ విద్యార్థులు విజయజేతనం ఎగురవేశారని శ్రీ విశ్వ విద్యా సంస్థల డైరెక్టర్ పి. నూర్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ శ్రీ విశ్వ విద్యాలయంనకు చెందిన వి. మధు నూర్య సాయి శంకర్ 99.67, నీ భవదీష్ 99.65, ఎం. తృణయాని 99.51. డి. దేవ మణికంఠ 99.49, కె. హరి సరణ్ 99.12. వి. యశ్వంత్ 99 పర్సంటైల్లో విజయం సాధించారని పేర్కొన్నారు. 99 వర్సంటైల్ పైగా సాధించిన వారు 6 మంది, 98 పైన సాధించిన వారు 28 మంది. 97 పైన సాధించిన వారు 43 మంది విద్యార్థులు ఈ ఘనత సాధించినట్టు వెల్లడించారు. జనవరి సెషన్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె. ధనరాజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక, కార్యాలయ సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ర్యాంకులు సాధించేందుకు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version