మంచి పాలన ..మరియు ఉత్తమ పద్ధతులపై వర్క్ షాప్
ముఖ్య అతిధిగా ఆర్ టి ఐ కమీషనర్ పి ఎస్ నాయుడు
గుంటూరు జిల్లా వడ్లమూడి విగ్నాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా లో నిర్వహించిన ఆర్‌టీఐ చట్టానికి 20 సంవత్సరాలు మంచి పాలన మరియు ఉత్తమ పద్ధతు అనే అంశంపై జరిగిన వర్క్‌షాప్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషనర్ పి ఎస్ నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. గత ఇరవై సంవత్సరాలలో ఆర్‌టీఐ చట్టం ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థపై అవగాహన పెంచి, మంచి పాలనను ప్రోత్సహించడంలో ముఖ్యమైన సాధనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
న్యాయ విద్యార్థులు, యువత మరియు సామాజిక కార్యకర్తలు ఆర్‌టీఐ చట్టాన్ని సమర్థంగా వినియోగించి సమాజంలో పారదర్శకతను పెంపొందించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విగ్నాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా ప్రిన్సిపాల్, అధ్యాపకులు, న్యాయ విద్యార్థులు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో ఆర్‌టీఐ చట్టం అమలు, మంచి పాలనలో దాని ప్రాధాన్యం మరియు ఉత్తమ పద్ధతులపై చర్చలు జరిగాయి.
