Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshపోర్టులో రూ. 5.4కోట్లతో షోర్ పవర్ సిస్టం

పోర్టులో రూ. 5.4కోట్లతో షోర్ పవర్ సిస్టం

ప్రారంభించిన చైర్మన్ అంగముత్తు

రూ. 5.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 1000 కేవీఏ సామర్థ్యంతో కూడిన లో వోల్టేజ్ షోర్ పవర్ సిస్టమ్ సౌకర్యాన్ని ఈక్యూ-1 బెర్త్ వద్ద పోర్ట్ చైర్ పర్సన్ డా. ఎం. అంగముత్తు మంగళవారం ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని రోమాస్ ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. ‘హరిత్ సాగర్’ కార్యక్రమం కింద మరియు గ్రీన్ ఇనిషియేటివ్‌లకు ప్రాధాన్యతనిస్తూ, పర్యావరణ హిత పోర్ట్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు వీపీఏ ఈక్యూ-1 బెర్త్ వద్ద షోర్ పవర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇది పోర్టులో అల్టర్నేట్ మారిటైమ్ పవర్ దశలవారీ అమలులో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తోంది. నౌకల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు, పర్యావరణ పనితీరును మెరుగుపరచేందుకు వీపీఏ సుస్థిర ఇంధన మౌలిక సదుపాయాలను సమన్వయం చేస్తోంది. ఈ షోర్ పవర్ ప్రాజెక్ట్ రెండు దశల్లో అమలు అవుతోంది. విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటు మరియు తగిన కేబుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ స్థాపన. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ‘హరిత్ సాగర్’ మార్గదర్శకాలు (ఎంఐవీ 2030)కు అనుగుణంగా తక్కువ ఉద్గారాలు కలిగిన, పర్యావరణ హిత పోర్ట్ వ్యవస్థ వైపు వీపీఏ వేస్తున్న అడుగులలో కీలక మైలురాయిగా నిలిచింది.ఈ కార్యక్రమంలో రోష్ని అపరాంజి, డిప్యూటీ చైర్‌పర్సన్, వీపీఏతో పాటు విభాగాధిపతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments