Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshవిద్యార్థులను సమాజ సేవలో భాగస్వామ్యం చేయండి

విద్యార్థులను సమాజ సేవలో భాగస్వామ్యం చేయండి

డిఎస్పీ నరసింహముర్తి సమాజ సేవలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా స్థానిక ఆర్పీబిఎస్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణం కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కృషి చేయాలన్నారు. అలాగే శిక్షణ పొందిన స్కౌట్స్ మాస్టర్లు పాఠశాల స్థాయి నుండే క్రమశిక్షణ, సేవభావం వంటి ఉన్నత విలువలు పెంపోందించేలా కృషి చేయాలన్నారు. శివరాత్రి ఉత్సవాలకు కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు తమ సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు, లీడర్ అఫ్ ద కోర్స్ జి. వెంకటేశ్వర్లు పాఠశాల హెచ్ ఎం వెంకటయ్య జిల్లా ఇంచార్జి కార్యదర్శి జి. విజయకుమార్,యూత్ చైర్మన్ ఎస్ కె అజారుద్దీన్,రాష్ట్ర పరిశీలకులు డి.ఎల్ నారాయణ,స్కౌట్స్ మాస్టర్లు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments