Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందించిన గంటా

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందించిన గంటా

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి శుక్రవారం ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో రూ.6.79 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆనందపురం, భీమిలి, జీవీఎంసీ 4, 5, 6, 7, 98 వార్డులకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ. 17 వేల నుంచి రూ. 2 లక్షల విలువైన చెక్కులిచ్చారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని గంటా ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, పిల్లా వెంకట్రావు, గరే గుర్నాథ్, పాసి నరసింగరావు, కోరాడ రమణ, నమ్మి రమణ, గరికిన ఎల్లయ్య, పంచదార్ల శ్రీనివాస్, పోతిన అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ, పాసి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments