Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshదావోస్ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి

దావోస్ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కీలక చర్చలలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ పర్యటన లో సీఎం తో కలసి పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇస్తోందని అయన తెలిపారు.ముఖ్యంగా దావోస్‌లో ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అనే అంశంపై సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం అంతర్జాతీయ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించిందని తెలిపారు.రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే సీఎం నిబద్ధతను, నిరంతర తపనను ఈ పర్యటనలో తాను అత్యంత దగ్గరుండి చూసానన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన విజనరీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా అవతరించబోతోందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments