Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradesh8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిసిసి మాజీ చైర్మన్..

8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిసిసి మాజీ చైర్మన్..

8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కొయ్యూరు సి డి పి ఓ దేవమణి ఆధ్వర్యంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాజేంద్రపాలెం లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిసిసి మాజీ చైర్మన్ ఎం వి వి ప్రసాద్ మరియు తాహసిల్దార్ మురళి బాబు, డాక్టర్ జగదీష్ , మాజీ ఎంపిటిసి శివరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జిసిసి చైర్మన్ మాట్లాడుతూ
ఈ కార్యక్రమం ఈనెల 9వ తారీఖు నుంచి 23వ తారీకు వరకు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని సెంటర్లో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన అంశం తల్లి మరియు శిశు పోషణ లో భాగంగా గర్భధారణ సమయంలో ఆహారం మరియు సంరక్షణ, గర్భిణీ పరీక్షల ప్రాముఖ్యత , పుట్టిన బిడ్డ కు పూర్తిగా తల్లిపాలు ఇవ్వడం , సరైన వయసులో అనుబంద ఆహారం ప్రారంభించడం వంటి సూచనలును గర్భిణీలకు , బాలింతలకు సిడిపిఓ గారు వివరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసాద్ గారు మాట్లాడుతూ గర్భిణీలు సరైన సమయంలో పరీక్షలు చేసుకోవాలని అందుబాటులో ఉన్న ఆసుపత్రిలోనే డెలివరీలు చేసుకోవాలి మరియు గర్భిణీలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు.
ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి లో ఉన్న గర్భిణీలు , బాలింతలు , సూపర్వైజర్లు , సిహెచ్ఓ ప్రశాంత్ గారు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments