Saturday, April 18, 2026
HomeNewsపెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ నిషాంతి. టి

పాడేరు కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో టెలికాం ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.
​ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ
​శాఖల మధ్య సమన్వయంతో రెవిన్యూ, అటవీ, పంచాయతీరాజ్, పి ఐ యు ఇంజనీరింగ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖల నుండి ఇప్పటికే పరిశీలన, అనుమతులు లభించిన టవర్ల నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం ఉండకూడదని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని
​సిగ్నల్ కనెక్టివిటీ గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు, ప్రజలకు ఇంటర్నెట్, మొబైల్ సేవలకు అత్యవసరమని, ఈ ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని టెలికాం విశాఖపట్నం బిఎస్ఎన్ఎల్ డీజీఎం, (కన్జ్యూమర్ మొబైల్ డేటా ) శ్రీకాంత్ పట్నాయక్ కు సూచించారు. కేటగిరీ 5లో అనుమతులు పొందిన చట్రాయపుట్టి సిగ్నల్ టవర్ ఇన్ ఎక్సెస్ బుల్ గా ఉందని, కొత్తపల్లి టవర్ పూర్తి చేయాలని ఆదేశించారు. కేటగిరి 6లో 11 అనుమతులు పొందగా అందులో నాలుగు పెండింగ్ ఉన్నాయని త్వరలో వాటి స్థితిగతులు తెలియజేస్తామని వివరించారు. లింగేటి పంచాయతీ దొండగరువు టవర్ కు సంబంధించిన పరిశీలించి, సిగ్నల్ టవర్ ఏర్పాటుకు అనుమతులు పొందాలని సూచించారు.
జిల్లాలో అనుమతులు ఇచ్చిన అన్ని మండలాల లోని మారుమూల గ్రామాలకు సంబంధించిన క్లియరెన్స్ లు , రెవెన్యూ,ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన ప్రాంతాల్లో వెంటనే సివిల్ పనులు ప్రారంభించి, మిగిలిన చోట్ల ప్రతిపాదనలను వేగవంతం చేయాలని, నెక్స్ట్ జరగబోయే సమావేశంలో పెండింగ్ సమస్యలపై పూర్తి చేసి రావాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments