Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఅనంతగిరి లో విషాదం:

అనంతగిరి లో విషాదం:

వాటర్‌ఫాల్స్‌లో పడి ముగ్గురు బాలికల మృతి

అరకు నియోజక వర్గం అనంతగిరి మండలం వలాసి పంచాయతీ పరిధిలోని మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో బాలిక ప్రమాదం నుంచి తప్పించుకుని గాయాలతో బయటపడింది

తెలిసిన వివరాల ప్రకారం, హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ “జంబువలస” గ్రామానికి చెందిన బాలికలు గురువారం ఉదయం అనంతగిరి మండలం, వలాసి పంచాయతీలోని మలంగుమ్మి వాటర్‌ఫాల్స్‌కు వెళ్లారు
అక్కడ జారుడు బల్లలా ఉన్న రాయిపై జారుతూ ఫోటోలు తీసుకోవాలని వారు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ముగ్గురు బాలికలు అదుపు తప్పి లోతైన గుమ్మిలో పడిపోయారు. ఈత రాకపోవడం, నీటి లోతు ఎక్కువగా ఉండటం వల్ల వారు బయటపడలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో బాలిక ఏదో విధంగా ఒడ్డుకు చేరుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెను వెంటనే అనంతగిరి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి ఫోటోలు తీస్తున్న మరో బాలిక సమీప గ్రామానికి వెళ్లి సమాచారం అందించడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.
బండరాయి మీద రాయి మీద నిలబడి ఫోటోలు దిగుతూ ఉండగా పొరపాటున జారి పడిపోయారనీ, ఫోటోల పిచ్చే వీరి ప్రాణం తీసింది అనిi తెలియజేసారు
అడవిలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం విశాఖ ప్రధాన రహదారి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చనిపోయిన బాలికల వివరాలు.
సాలెపు త్రిష (17) హుకుంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకొంది.
సాలెపు రత్నకుమారి పదవ తరగతి చదువుతుంది
సాలెపు పవిత్ర,ముగ్గురు జంబువలస బూర్జ పంచాయతీ వారే.
అంజలి అనే బాలిక ఈ ప్రమాదం నుండి బయట పడి లొంగిపర్తి పి హెచ్ సి లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది.ఈ ఘటన స్థానిక గ్రామాల ప్రజలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments