వైఎస్ ను తలుచుకుంటూ భావోద్వేగం
మంత్రి అచ్చెన్న విమర్శలపై ఆగ్రహం
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకున్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ గురించి మాట్లాడుతూ ఆయనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఉదయం ప్రెస్ మీట్ లో మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నారన్న ఆరోపణల్నిబొత్స గతంలో చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బొత్స జగన్తో పాటు వైఎస్, విజయమ్మ, షర్మిలను కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు అప్పుడు అన్న మాటల్ని అచ్చెన్నాయుడు గుర్తు చేయడంపై మండిపడ్డాపు. రాజకీయాల్లో అందరూ నీలాగే ఉంటారనుకుంటావా అని అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. కూటమి నేతలు సంస్కారం లేకుండా రాజకీయం చేస్తున్నారని.. విమర్శించారు. అచ్చెన్నాయుడు కావాలనే జగన్ పై బురదచల్లుతున్నారని ఆరోపించారు. ఆయన దిగజారుడు మాటలు మాట్లాడకపోవడం మంచిదన్నారు. రాజకీయాలను నీతిగా చేయాలని బొత్స సలహా ఇచ్చారు. మావిగన్ వస్తున్న స్పందనను చూసే.. డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. అమరావతిపై విమర్శలకు రాజకీయంగా స్పందించాలని సూచించారు.
