Saturday, April 18, 2026
HomeNewsతల్లి కళ్ళను దానం చేసిన తనయుడు

తల్లి కళ్ళను దానం చేసిన తనయుడు

అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి కళ్ళు వేరే ఒకరికి ఉపయోగపడాలని, తన తల్లి కళ్ళు నిర్జీవంగా ఉండాలన్న ఆశయంతో ఆమె కళ్ళును తన కుమారుడు దానం చేశాడు. మాడుగుల నియోజకవర్గ పరిధిలోగల దేవరపల్లి మండలం వాకపల్లి గ్రామానికి చెందిన పుట్ట కనకం భార్య వెంకటలక్ష్మి (63) అనారోగ్యంతో విశాఖ కేజీ హెచ్ లో మృతి చెందింది. దీంతో ఈమె కళ్ళు మరొకరికి చూపు కావాలన్నా సదుద్దేశంతో ఆమె కుమారుడు అనకాపల్లి జిల్లా వాసవి క్లబ్ జిల్లా అధికారి పుట్ట నానాజీ బుధవారం ఆ కళ్లను ఎల్వి ప్రసాద్ నేత్ర ఆసుపత్రికి దానం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వారు నేత్రదానద్రవపత్రాన్ని నానాజీ కి అందజేసి అభినందించారు. తన తల్లి కళ్ళు మరొకరికి చూపు కావాలన్నా ఆయన ఆశయం ఎంతో మంచిదన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments