ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా నిడదవోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు పి చెరియన్ నాయకత్వం వహించారు.
8-04-2026 నుండి 11-04-2026 వరకు నిర్వహిస్తున్న ఈ పోరాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు 29 డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు ముఖ్యంగా 12వ పిఆర్సి నియమించి 36% ఐఆర్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్ డిఏలు మరియు సరెండర్ లీవ్ నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, నగదు రహిత హెల్త్ కార్డ్స్ ద్వారా వైద్యం అందించాలని కోరారు.
ఈ డిమాండ్లకు సంబంధించిన నోటీసును గత నెలలోనే ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. నిడదవోలులో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నర్సింగ్, పారామెడికల్ మరియు సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర నాయకత్వ ఆదేశాల ప్రకారం తదుపరి పోరాట కార్యక్రమాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రాంచ్ కార్యదర్శి జి అనిల్ కుమార్ తెలిపారు
మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నిరసన …..29 డిమాండ్ల పరిష్కారానికి పోరాటం
RELATED ARTICLES
