ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని మంగళవారం విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు.
ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం ఏ ఈ ఓ తిరుమలేశ్వరరావు స్వాగతం పలికారు.అనంతరం ధ్వజస్తంభం వద్ద ఆలయ పర్యవేక్షణ అధికారి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆలయ మర్యాదలను అనుసరించి స్వామివారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు.
ముందుగా ఎమ్మెల్యే దంపతులు సింహాచల క్షేత్రంలోని అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు నాదస్వర మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యే దంపతులకు ‘వేద ఆశీర్వచనం’ అందజేశారు. ఈ సందర్భంగా:
ఆలయ ఏఈవో స్వామివారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు.
లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు*
RELATED ARTICLES
