Friday, May 1, 2026
HomeNewsరాష్ట్రపతి భవన్ కు రాజధాని బిల్లు

రాష్ట్రపతి భవన్ కు రాజధాని బిల్లు

చట్టరూపం దాల్చనున్న అమరావతి

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టరూపం దాల్చనుంది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లుకు పార్లమెంట్‌ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పార్లమెంట్​ తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అమరావతికి శాశ్వతంగా దృఢత్వం వచ్చింది. సుమారు 5 గంటల పాటు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఉభయ సభల ఆమోదం తర్వాత లోక్‌సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపింది. నేడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో అమరావతి ప్రాంత ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments