Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshడ్రైనేజీలా, రహదారులా...???

డ్రైనేజీలా, రహదారులా…???

రోడ్ల పైనే మురుగనీరు వ్యర్ధాలు

అధికారులకు పట్టదా

చోడవరంలో డ్రైనేజీలు, కాల్వల్లో ప్రవహించాల్సిన మురుగు నీరు, వ్యర్ధాలు రహదారుల్లోనే ప్రవహి స్తుండటంతో ఏవి రహదారులో, ఏవి డ్రైనేజీలో అర్థం కావడం లేదనీ ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగిస్తూ, రోడ్లపై యదేచ్చగా మురుగునీరు వ్యర్ధాలు ప్రవహిస్తుండడంతో స్థానికులు, మహిళలు, బాటశారులు, వాహనదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. చోడవరం ప్రధాన రహదారిలో వివిధ వ్యాపార సముదాయాలు ద్వారా వదులుతున్న మురుగునీరు బి.ఎన్ రోడ్డు ప్రధాన రహదారిపై స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఏరులై ప్రవహిస్తోంది. చోడవరం – చీడికాడ రోడ్డు లో రెల్లి కాలనీ లో డ్రైనేజీలు లేక ప్రధాన రహదారినే … పంచాయతీ అధికారులు డ్రైనేజీలుగా మార్చేస్తున్నారు. చోడవరం – లక్ష్మీపురం రోడ్డులో కోనాం గెస్ట్ హౌస్ వద్ద ప్రధాన రహదారినే డ్రైనేజీగా వినియోగిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన పంచాయితీ, ప్రజారోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు చూసి, చూడలేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యర్ధాలు, మురుగు నీరుతో దోమలు, వైరస్ క్రిములతో స్థానిక కనీసం బ్లీచింగ్, ఫినాయిల్ వంటివి ఆ ప్రాంతాల్లో జల్లిస్తే దుర్వాసన తగు ముఖం పడతాదని అంటున్నారు.ప్రజానీకం వీటితో సహవాసం చేస్తూ పలు అంటు వ్యాధులకు గురి కావలసి వస్తోందని మహిళలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాలువలు పూడిక తీయించి మురుగనీరు రోడ్లపై ప్రవహించకుండా పంచాయతీ కోరుతున్నారు దీనిపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే రోగాలు ప్రబల అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments