Friday, May 1, 2026
HomePoliticsAndhra Pradeshబీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

మన ఊరు – మన జెండా పేరుతో జెండా ఆవిష్కరించిన గంకల*

200మంది పేద ప్రజలకు బియ్యం పంపిణి

విశాఖపట్నం జీవీఎంసీ 48వ వార్డులో మాజీ కార్పొరేటర్, మాజీ జీవీఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్,మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గంకల మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక శత్రు దేశాలు దాడి చేసేందుకు కూడా వెనకడుగు వేశాయన్నారు.ప్రపంచంలో అతిపెద్ద శక్తివంతమైన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక మహావృక్షంగా మారిందన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక కుల, మత ఘర్షణలు లేవని తెలిపారు. ‘సబ్ కా సాత్.. సబ్‌ కా వికాస్’ నినాదంతో బీజేపీ అడుగులు వేస్తోందన్నారు.దేశ నిర్మాణం లో సమస్యల పరిష్కారనికి భారతీయ జనతా పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు.బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ ని అధికారంలోకి రావడానికి కృషి చేయాలన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తోందన్నారు.విశాఖ నార్త్ లో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సారధ్యంలో బిజెపి పార్టీ మరింత బలపడుతుందన్నారు. గడిచిన ఐదేళ్లలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేసి జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని,వార్డు అభివృద్ధి బిజెపి పార్టీతో సాధ్యమని నిరూపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. ఇదే ఉత్తేజంతో రానున్న జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపికి అధిక సీట్లు గెలుపొందేలా కార్యకర్తలు, నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వార్డులో సుమారు 200 మంది పేద ప్రజలకు గంకల కవితా అప్పారావు యాదవ్ చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల కవిత అప్పారావు యాదవ్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments