అందమైన ఆధునిక ఉద్యాన ప్రాంగణంగా ముస్తాబు
సుందరమైన వాకర్స్ ట్రాక్ కు కార్యాచరణ లు
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు గ్రీన్ సిగ్నల్
అభివృద్ధి పథంలో టెక్కలి ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ప్రగతిని పరుగులు పెట్టే విధంగా ప్రజలం గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే వినూత్న కార్యాచరణ కు నిర్మితాలకు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టడం ప్రజలు హర్షిస్తున్నారు.
టెక్కలి పట్టణంలో తరాల నుంచి మురికి కోనేరుగా మిగిలిన పట్టు మహాదేవి కోనేరును ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సుందరీకరణకు స్థానికులు ,అధికారుల సమన్వయంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా పట్టుమహాదేవి కోనేరు పరిసర ప్రాంతాలను సుందర ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు అధికారులకు ఆదేశించారు.
ఈ కోనేరు చుట్టూ విశాలమైన ప్రహరీ రక్షణ గోడ, వాకర్స్ ఆనందంగా సంతోషంగా నడిచి తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు అవసరమైన భార్యతో పాటు అందమైన పూల నందనవనం తయారీ కి కార్యాచరణ జరిగింది, కోనేరు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం విద్యుత్తు, విశ్రాంతి వినోదం, ఉల్లాసం కలిగేలా పట్టు మహాదేవి కోనేరు చుట్టూ పార్క్ తయారుకు ప్లాను సిద్ధమైంది, ఈ కోనేరు అభివృద్ధి గూర్చి అధికారులు, స్థానిక నేతలతో మంత్రి కింజరాపు అచ్చం నాయుడు సమీక్ష సమావేశంలో పరిపూర్ణమైన ఆదేశాలు సూచనలు ఇచ్చి ప్రజలకు నూతన ఉత్తేజాన్ని కలిగేలా పట్టు మహా దేవి కోనేరు మహత్తర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ తెలియజేశారు . ఆయనతోపాటు పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్, టెక్కలి ఆర్డిఓ ఎం కృష్ణమూర్తి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
