Friday, May 1, 2026
HomeNewsబాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు..

బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు..

నిడదవోలు నియోజకవర్గం, సమిశ్రగూడెం గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా lవిగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా భద్రందొర మాట్లాడుతూ, బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అపారమైన సేవలు అందించిన మహానుభావుడని పేర్కొన్నారు. సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలందించి దేశ అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు.
అలాంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పెరిగిన ధరలు, గ్యాస్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల రెడ్డి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలు, రైతులు, యువతకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు గడ్డం రవీంద్రబాబు, ముప్పిడి సువర్ణరాజు, మాజీ ఎంపీటీసీ నరసింహమూర్తి, రాజరత్నం, మెహబూబ్ వలి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు డ్రింక్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments