` టీడీపీ యువనేత గంటా రవితేజ
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతానికి రూ. 1,278 కోట్లతో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ప్రాజెక్టులు ఖరారయ్యాయి. తాగునీరు ప్రాజెక్టు డీపీఆర్ పూర్తి కాగా.. యూజీడీ ప్రాజెక్టు టెండర్ స్టేజ్ లో ఉంది. రూ. 553 కోట్లతో ప్రతిపాదించిన సమీకృత యు.జి.డి. ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం లభించింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఐ.ఎఫ్.సి. రూ. 498 కోట్లు అందిస్తుండగా.. అమృత్ 2 కింద రూ.45.74 కోట్లు, జీవీఎంసీ రూ.9.36 కోట్లు సమకూరుస్తాయి. డ్రైనేజీల అనుసంధానం, పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తారు. దీని వల్ల కాలుష్యం తగ్గి, రెండున్నర లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మధురవాడ జోన్ లో 24 / 7 మంచినీటి సరఫరా కోసం రూ.725 కోట్లు మంజూరైంది. ఇందులో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ (యు.సి.ఎఫ్.) వాటా రూ. 181 కోట్లు. ఈ రెండు భారీ ప్రాజెక్టులు మధురవాడకు రావడానికి కారకులైన సీఎం చంద్రబాబు నాయుడికి, మున్సిపల్ మంత్రి పి. నారాయణకి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి టీడీపీ యువనేత గంటా రవి తేజ కృతజ్ఞతలు తెలిపారు.
బాలికలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా ప్రభుత్వం ప్రారంభించిన హెచ్.పి.వి. వాక్సినేషన్ లో భీమిలి నియోజకవర్గం ముందుంది. 4,208 మంది 14-15 ఏళ్ల బాలికలను గుర్తించగా.. నాలుగో వంతు మందికి అంటే 1,061 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. నూరు శాతం లక్ష్యాన్ని నెరవేరేలా బాలికలు, టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, తల్లిదండ్రులను కార్మోనుఖుల్ని చేయాల్సి ఉంది. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారు.
