శ్రీరామనవమి సందర్భంగా చోడవరం మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామ నవమి వేడుకులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా రామాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాల వద్ద సీతా,లక్ష్మణ ,హనుమాన్ సమేత శ్రీరామచంద్రమూర్తికి భక్తులు అభిషేక పూజలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక వ్యాపార వీది అభయాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామచంద్రుని వరుడు గాను సీతామహాలక్ష్మి దేవిని వధువు గాను అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కళ్యాణం కన్నుల పండువుగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ,సీతమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆచార సాంప్రదాయాల అనుసరించి వివాహ మహోత్సవాన్ని జరిపారు. ఈ పూజల్లో హనుమత్ మాలాదారులు భక్తులు పాల్గొని నైవేద్యాల సమర్పించి పూజలు జరిపారు అలాగే ఎడ్ల వీధి, వెలమవీధి, బాలాజీ నగర్, కోపరేటివ్ కాలనీ తదితర వార్డుల్లో రామాలయాలు వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే మండలంలోని గోవాడ, వెంకన్నపాలెం గవరవరం, అంబేరుపురం ,లక్కవరం ,మైచర్లపాలెం, దామనాపల్లి ,శ్రీరామపట్నం ,గౌరీ పట్నం తదితర గ్రామాల్లోని శ్రీరామనవమి మహోత్సవాలు అత్యంత వేడుకగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో పాటు అన్న సమారాధనలు కూడా జరిపారు. దీంతో వాడవాడలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు తో సందడిగా మారాయి.రాత్రి స్వామి వారి తిరువీధి ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వాడవాడలా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు
RELATED ARTICLES
