Saturday, April 18, 2026
HomeNewsభూ హక్కు దారులు రైతులకు మోసగిస్తే ఊరుకోం

భూ హక్కు దారులు రైతులకు మోసగిస్తే ఊరుకోం

మూలపేట పోర్ట్ భూ సేకరణ అప్పుడే పూర్తి చేశారు

రైతుల భూముల జోలికి వస్తే
ఉద్యమిస్తాం

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిక

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఉత్తరాంధ్ర మణిహారంగా ఈ ప్రాంత వాసులు అందరికీ ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లు కలుగుతుందని ఉన్నత లక్ష్యముతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో యుద్ధ ప్రాతిపదికన ప్రజా సంక్షేమం కోసం గ్రీన్ పోర్ట్ నిర్మాణం త్వరిత గతిన పూర్తిచేసి ,ప్రజలకు అంకితం చేసేందుకు ఆయన హయాంలోనే పూర్తిగా పోర్టు భూముల సేకరణ జరిగిందని మళ్లీ అధనంగా రైతుల వద్ద నుంచి భూ సేకరణ అవసరం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

రైతులు వద్ద నుండి అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, మరి కొంతమంది జిల్లా నాయకులు ,స్వార్థం కోసమేనని ఈ భూములన్నీబడా పారిశ్రామిక వేత్తలకు వీళ్లు సొమ్ములకు అమ్ముకోవడానికి వేస్తున్న మాస్టర్ ప్లాన్ అని శ్రీనివాస్ విమర్శించారు.

రైతుల భూములను గ్రీన్ పోర్ట్ కోసం అయోధ్య పురం నుంచి మూలపేట పోర్టు వరకు కావలసిన భూసేకరణ అప్పుడే జరిగిందని, ప్రస్తుతం సెంటు భూమి కూడా పోర్టు అభివృద్ధికి కొనుగోలు చేయాల్సిన పనిలేదని ఆయన అన్నారు, ఒకవేళ పారిశ్రామిక అభివృద్ధి కోసం భూముల అవసరమైతే పారిశ్రామికవేత్తలు నేరుగా రైతులు వద్ద నుంచి కొనుగోలు చేయాలని రైతులే వారి భూముల ధర నిర్ణయించి వారి అంగీకారంతో వాళ్లకు నచ్చిన ధరకు క్రయవిక్రయాలు జరగాలని అది రైతుల ఇష్ట ప్రకారం అమ్మకాలు జరగాలన్నారు. అప్పట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూలపేట, విష్ణు చక్రం నిర్వాసితులకు భూముల నిధులను తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారన్నారని తెలిపారు.

నేటి కూటమి ప్రభుత్వం, మంత్రులు, పారిశ్రామిక అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ పేరుతో అనవసరపు భూ సేకరణ పేరిట రైతులు వద్ద నుంచి భూములు కొనుగోలు చేసి బడా పారిశ్రామిక వేత్తలతో అంతర్గత వ్యాపార భాగస్వామ్యం పొంది భూ హక్కుదారులైన సామాన్య రైతులకు అన్యాయం చేయాలని కింజరాపు కుటుంబం చూస్తుందని దీన్ని పూర్తిగా వ్యతిరేకించి భూ హకుదారులైన స్థానిక రైతుల శ్రేయస్సుకోసం మరో ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments